సిడ్నీ: ఇండియాతో ఆదివారం సిడ్నీలో జరిగే మూడో వన్డే(AUSvIND) కోసం ఆస్ట్రేలియా జట్టు మార్పులు చేసింది. న్యూ సౌత్‌వేల్స్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్‌ను జట్టులోకి తీసుకున్నది. ఇక రెండు జట్ల మధ్య జరిగే టీ20ల కోసం గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వార్షియస్ కు కూడా అవకాశం ఇచ్చింది. మరో ఫాస్ట్ బౌలర్ మహలి బియర్డ్మ్యాన్కు కూడా టీ20ల్లోకి తీసుకున్నారు. ఆటగాళ్ల మార్పు గురించి క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన చేసింది. వన్డే బృందం నుంచి మార్నస్ లబుషేన్‌ను కూడా తప్పిస్తున్నట్లు పేర్కొన్నది. క్వీన్స్‌ల్యాండ్ షెఫీల్డ్ టోర్నీలో పాల్గొనేందుకు అతనికి పర్మిషన్ ఇచ్చారు.
జోష్ హేజిల్‌వుడ్, సీన్ అబ్బాట్ .. టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లను మిస్కానున్నారు. హేజిల్‌వుడ్ కేవలం తొలి రెండు టీ20లను మాత్రమే ఆడనున్నారు. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఆడిన మాథ్యూ కుహనేమాన్.. రెండో వన్డేకు మిస్ అయ్యాడు. జంపా జట్టులోకి రావడంతో అతన్ని తప్పించారు. అయితే సిడ్నీలో జరిగే మూడో వన్డేకు మళ్లీ అతన్ని తీసుకున్నారు. అదనపు వికెట్ కీపర్‌గా జోష్ ఫిలిప్‌ను తీసుకున్నారు. మ్యాక్స్‌వెల్ చివరి మూడు టీ20 మ్యాచుల్లో ఆడనున్నాడు.
20 ఏళ్ల బౌలర్ బియర్డ్మ్యాన్ను చివరి మూడు టీ20 మ్యాచ్‌లకు ఎంపిక చేశారు. దేశవాళీ లీగ్ మ్యాచుల్లో బియర్డ్మ్యాన్ సంచలనం సృష్టిస్తున్నాడు. దీంతో అతనికి జాతీయ జట్టులో అవకాశం కల్పించనున్నారు. ఇటీవల ఇండియా ఏతో జరిగిన సిరీస్‌లో ఆస్ట్రేలియా ఏ తరపున ఎడ్వర్డ్స్ రాణించాడు. దీంతో అతనికి మూడో వన్డే కోసం పిలుపు ఇచ్చారు.
Maxi’s back and an U19 World Cup winner bolts in to face India! #AUSvEND https://t.co/1eiLZmh5X7
— cricket.com.au (@cricketcomau) October 23, 2025