మణికొండ: ఆల్ఇండియా స్విమ్మింగ్ మాస్టర్స్ చైర్మన్‌గా కోకాపేటకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నికయ్యారు. తమిళనాడులో ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు చంద్రశేఖర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న చంద్రశేఖర్‌రెడ్డి.. ఇక పై జాతీయ స్విమ్మింగ్ మాస్టర్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. స్విమ్మింగ్ మాస్టర్స్ ఆల్ ఇండియా చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై చంద్రశేఖర్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు.