IND vs PAK | దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 10వ ఓవర్లో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ వేసిన 9.2వ బంతికి ఇమామ్ (10) రనౌట్ అయ్యాడు. అంతకుముందు 9వ ఓవర్లో బాబర్ ఆజామ్ (23) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి పాకిస్తాన్ స్కోర్ 52/2. ప్రస్తుతం క్రీజులో రిజ్వాన్ (4), సౌద్ (3) ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ఐసీసీ ఈవెంట్లో సెమీస్‌కు మరింత దగ్గరవుతుంది. అయితే, విజయం సాధిస్తేనే పాక్‌కు సెమీస్‌కు ఛాన్స్ ఉంటుంది. లేకపోతే టోర్నీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో దాంతో ఇరుజట్లకు మ్యాచ్ కీలకంగా మారింది.
ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి రేసులో ఉండాలని పాక్ కృతనిశ్చయంతో ఉన్నది. ఇక బంగ్లాదేశ్‌పై భారత్ భారీ విజయం సాధించిన రోహిత్ సేన.. దాయాదిపై సైతం విజయం నమోదు గెలవాలన్న కసితో ఉన్నది. అయితే, ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భారత్ పైచేయి కావడం భారత్‌కు ఊరటనిచ్చే అంశం. దుబాయిలో భారత్‌కు మంచి రికార్డు ఉన్నది. పాక్‌తో టీమిండియా దుబాయిలో రెండు వన్డే మ్యాచులలో గెలిచింది. ఇక భారత్-పాక్ జట్లు చివరగా వన్డే ఫార్మాట్లో 2023లో తలపడ్డాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది.
ఆ మ్యాచ్‌లో పాక్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. కేవలం 42.5 ఓవర్లకు 191 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. భారత బౌలర్లు చెలరేగడంతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఆ మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం మాత్రం 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత టీమిండియా 30.3 ఓవర్లలోనే ఏడు వికెట్లు కోల్పోయి 192 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 86 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇప్పటివరకు రెండు జట్లు వన్డేల్లో 135 సార్లు తలపడ్డాయి. భారత్ 57 మ్యాచ్‌లలో విజయం సాధించగా, పాకిస్తాన్ 73 మ్యాచుల్లో గెలిచింది. ఐదు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. అయితే, తటస్థ వేదికల్లో జరిగిన మ్యాచుల్లో పాకిస్తాన్ ఎక్కువగా గెలిచింది. రెండు జట్ల మధ్య 77 వన్డే మ్యాచ్‌లు ఇతర వేదికల్లో జరిగాయి. భారతదేశం 34 మ్యాచ్‌లలో విజయం సాధించగా, పాకిస్తాన్ 40 మ్యాచ్‌లలో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.