Rohit Sharma | తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలను టీమిండియా సారథి రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 76 పరుగులతో అజేయంగా నిలిచి.. మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించిన రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్ గురించి ఊహాగానాలకు తెర దించాడు. తాను వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే రిటైర్ కాబోవడం లేదని తెలిపాడు. దయచేసి ఎవరూ పుకార్లు వ్యాప్తి చేయొద్దని కోరాడు. ఈ ప్రశ్న విని తాను ఆశ్చర్యం వేసిందని చెప్పాడు. భవిష్యత్ ప్రణాళిక ఏమీ లేదని.. ఏం జరగాలని ఉందో అదే జరుగుతుందని పేర్కొన్నాడు.
చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం నుంచే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ.. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో రాణించాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా పర్యటనలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న రోహిత్ శర్మపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్పిన టైమ్ వచ్చిందని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు సైతం రోహిత్ శర్మ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్ అయ్యే అవకాశం ఉందని ఊహానాగాలు వచ్చాయి. తాజాగా వాటన్నింటికి రోహిత్ ఫుల్స్టాప్ పెట్టాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ సిరీస్‌లో పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడిన రోహిత్, తనకు ఇష్టమైన ఫార్మాట్లో తిరిగి ఫామ్‌లోకి తిరిగివచ్చాడు. హాఫ్ సెంచరీతో మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. ఫైనల్లో విజయం తర్వాత రోహిత్ మాట్లాడుతూ ఫలితం వైపు ఉండడం మంచి అనుభూతిని ఇచ్చిందని చెప్పాడు. తన బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. తాను సహజంగా అలా ఆడనని.. కానీ అలా చేయాలని అనుకుంటున్నానని.. భిన్నంగా ఏదైనా చేసినప్పుడు జట్టు, మేనేజ్మెంట్ మీతోనే ఉంటాయని చెప్పాడు. ఈ విషయంలో గతంలో ఈ విషయంపై రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడానని.. ప్రస్తుతం గౌతమ్ గంభీర్‌తో మాట్లాడానని తెలిపాడు. ఇన్నేళ్లు వేరే శైలిలో ఆడానని.. ఇప్పుడు మరో శైలితో ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నాడు.
ఆల్ రౌండర్ల గురించి మాట్లాడుతూ తనకు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం లభించిందని.. జడేజా ఎనిమిదో స్థానంలో వస్తున్నాడని.. ఇది నాకు స్వేచ్ఛగా ఆడేందుకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నాడు. ఇక కేఎల్ రాహుల్‌ను ప్రశంసిస్తూ.. అతను ఒత్తిడిలో భయపడడని.. అందుకే మేము మిడిల్ ఓవర్లలో అతన్ని తీసుకోవాలని కోరుకున్నట్లు తెలిపాడు. బ్యాటింగ్ చేసినప్పుడు.. చాలా ప్రశాంతంగా.. పరిస్థితికి అనుగుణంగా ఆడతాడని పేర్కొన్నాడు. హార్దిక్ వంటి ఇతర బ్యాట్స్మెన్లకు స్వేచ్ఛ ఇస్తాడని చెప్పాడు. తొమ్మిది వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తిని ప్రశంసిస్తూ అతను భిన్నంగా ఉంటాడని.. దుబాయిలాంటి పిచ్‌లపై ఆడినప్పుడు న్యూజిలాండ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేశాడని.. ఐదు వికెట్లు కూడా తీశాడని తెలిపాడు.
ROHIT SHARMA DROPS BANGER. 🎤
– 2027 World Cup in South Africa.🤞🇮🇳 pic.twitter.com/SKPGbIOeQg
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025