IND vs NZ | ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియాకు షాక్ తగిలింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (76) ఔటయ్యాడు. 27వ ఓవర్లో రచిన్ రవీంద్ర వేసిన తొలి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి రోహిత్ స్టంపౌటయ్యాడు.
న్యూజిలాండ్ నిర్దేశించిన 252 పరుగుల టార్గెట్ను చేధించే క్రమంలో ఇప్పటికే శుభ్మన్ గిల్ (31), విరాట్ కోహ్లీ (1) విఫలమయ్యారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ దూకుడుగానే ఛేజింగ్ మొదలుపెట్టారు. అయితే 19వ ఓవర్లో మిచెల్ శాంత్నర్ వేసిన నాలుగో బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా పంపేందుకు ప్రయత్నించి ఫిలిప్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పట్నుంచి టీమిండియా పరుగుల వేగం తగ్గింది. 27వ ఓవర్లో రోహిత్ శర్మ కూడా ఔటవ్వడంతో టీమిండియా పరుగుల చేధనలో చెమటోడుస్తోంది.