Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టును ఆదివారం ప్రకటించింది. జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు ఈ జట్టులో చోటు కల్పించలేదు. ఇటీవల బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉన్నది. ఐసీసీ ఎదుట బౌలింగ్ యాక్షన్‌ను నిరూపించుకునే వరకు బౌలింగ్ చేయలేదు. చెన్నైలోని రామచంద్ర సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్‌లో నిర్వహించిన పరీక్షల ఆధారంగా 37 ఏళ్ల బౌలర్‌ను ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) పరిధిలోని పోటీల్లో బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక బంగ్లాదేశ్ జట్టు 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంది. ఆ జట్టులోని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్, ఆల్ రౌండర్ మహ్మదుల్లా ఉన్నారు. పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతను ఇప్పటి వరకు కేవలం ఏడు టీ20లు మాత్రమే ఆడాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ నహిద్ రాణా కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రాణా.