క్రిస్ట్‌చర్చ్: కెప్టెన్ టామ్ లాథమ్ (145), మిడిలార్డర్లో రచిన్ రవీంద్ర (176) భారీ శతకాలు సాధించడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టుపై న్యూజిలాండ్ పట్టు బిగించింది.
ఈ ఇద్దరి శతకాలతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 417 పరుగులు చేసింది. ఆ జట్టు మొత్తంగా 481 పరుగులు భారీ ఆధిక్యంలో ఉంది.