హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీబీఎస్ఈ నేషనల్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో నెగ్గిన యువ అథ్లెట్లకు రాష్ట్ర ఐటీ ప్రిన్సపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ట్రోఫీలు అందజేశారు. గాడియం స్కూల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా ఏడు వందలకు పైగా పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో చదువుతో పాటు ఆటలు చాలా ముఖ్యమని అన్నారు. గాడియం స్పోర్టోపియాలో ఈ చాంపియన్షిప్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాడియం స్కూల్ డైరెక్టర్ కీర్తి రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి మహేశ్వర్, రామ్మోహన్, ప్రభు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.