RCB Vs GT | రాయల్స్ చాలెంజర్స్ విధించిన 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగుల వద్ద కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు. ఒక ఫోర్, సిక్సర్ సహాయంతో 15 పరుగు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఐదో ఓవర్లో భువనేశ్వర్ వేసిన మూడో బంతిని సిక్సర్‌గా గిల్.. ఆ తర్వాత బంతిని సైతం భారీ షాట్‌కు యత్నించి లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం సాయి సుదర్శన్ 15, జోస్ బట్లర్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు గుజరాత్ ఇంకా88 బంతుల్లో 138 పరుగులు చేయాలి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.