Chinnaswamy Stampede | తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యమే కారణం.. పోలీసులను తప్పుపట్టలేం..!
Chinnaswamy Stampede : భారత క్రీడా చరిత్రలో రెండో దుర్ఘటనగా పేర్కొనదగిన చిన్నస్వామి తొక్కిసలాట పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. జూన్ 4న జరిగిన ఈ సంఘటనపై యావత్ భారతం ఆర్సీబీని దుమ్మెత్తిపోయగా తాజాగా కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT) కూడా సంచనల వ్యాఖ్యలు చేసింది.
Chinnaswamy Stampede : భారత క్రీడా చరిత్రలో రెండో దుర్ఘటనగా పేర్కొనదగిన చిన్నస్వామి తొక్కిసలాట పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. తమ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుపొందిన తమ జట్టును చూసేందుకు పోటెత్తిన ఫ్యాన్స్‌లో 11 మంది అసువులు బాశారు. జూన్ 4న జరిగిన ఈ సంఘటనపై యావత్ భారతం ఆర్సీబీని దుమ్మెత్తిపోయగా తాజాగా కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT) కూడా సంచనల వ్యాఖ్యలు చేసింది. తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యానిదే తొలి బాధ్యత అని క్యాట్ తెలిపింది.
ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించిన ఆర్సీబీ మరుసటి రోజే కర్నాటకలో విజయయాత్రకు పిలుపునిచ్చింది. విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకూ విక్టరీ పరేడ్‌లో నిర్వహిస్తామని, అభిమానులు భారీగా తరలిరావాలని బెంగళూరు ఫ్రాంచైజీ కోరింది. కానీ, అందుకు తగిన భద్రతా ఏర్పాట్లను మాత్రం చేయలేదు. అందుకే తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యమే ప్రథమ దోషి అని క్యాట్ అభిప్రాయపడింది.

‘ఐపీఎల్ విజేతగా నిలిచిన తర్వాత బెంగళూరు టీమ్ ఎక్స్ వేదికగా విక్టరీ పరేడ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ జూన్ 4న చిన్నస్వామికి భారీగా తరలివచ్చారు. 35 వేల సామర్థ్యం ఉన్న స్టేడియానికి 2.5లక్షల మంది రావడంతో పోలీసులు వాళ్లను అదుపు చేయలేకపోయారు. పైగా వాళ్లకు అంతమందిని నియంత్రించేందుక అవసమరైన బలగాలను సమకూర్చుకునే సమయం కూడా లేకపోయింది. అయినా పోలీసులేమీ దేవుళ్లు కాదు కదా.. అంతా క్షణాల్లో అదుపు చేయడానికి. సో.. ఈ దుర్ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని చెబుతూ ఆర్సీబీ యాజమాన్యం తప్పించుకోవడానికి లేదని క్యాట్ వెల్లడించింది. చిన్నస్వామి తొక్కిసలాట తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.

భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ దేవ్జిత్ సైకియా(Devjit Saikia) సైతం ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా విక్టరీ పరేడ్ జరపడాన్ని ఖండించాడు. దాంతో, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కర్నాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఫలితంగా ఆర్సీబీ, కర్నాటక క్రికెట్ సంఘం, ఈవెంట్ ప్లానింగ్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. అనంతరం కేసీసీఏ సెక్రటరీ ఏ శంకర్, కోశాధికారి జయరామ్ రాజీనామా చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా బీసీసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
- Osmania University | అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు : విద్యార్థి నాయకులు
- Medaram | మేడారానికి స్పెషల్ బస్ సర్వీస్.. షెడ్యూల్ ఇదే
- Kakatiya University | జెట్టి రాజేందర్‌కు రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్
- Students | క్లాస్‌లో ఉండాల్సిన వేళ.. పిచ్చిమొక్కలు, గడ్డి తొలగింపు పనిలో విద్యార్థులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

