సిడ్నీ: పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకునే పిల్లికి కటింగ్ చేయించేందుకని ఆస్ట్రేలియాలో ఓ షాప్‌నకు వెళ్లగా అక్కడ బిల్లు చూసి అక్రమ్ అవాక్కవ్వక తప్పలేదు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో భాగంగా కామెంట్రీ విధులు నిర్వర్తిస్తుండగా అక్రమ్ మాట్లాడుతూ.. ‘నేను నిన్న నా పిల్లికి హెయిర్ కట్ చేయించేందుకు వెళ్లాను. అందుకోసం వాళ్లు ఒక వెయ్యి ఆస్ట్రేలియన్ డాలర్లు చార్జ్ చేశారు. ఇదే పాకిస్థాన్‌లో అయితే 200 పిల్లులను కొనుక్కోవచ్చు’ అని చెప్పిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.