బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్ 8 కమ్యూన్’ పబ్ మరోమారు చిక్కుల్లో పడింది. గతంలో ఫైర్‌సేఫ్టీ నిబంధనలు అతికమ్రించడంతో పాటు అర్ధరాత్రి సమయంలో పెద్దపెద్ద శబ్ధాలతో పబ్ నిర్వహించిన కోహ్లీ పబ్ తాజాగా మరో వివాదానికి కారణమైంది. పబ్‌లో నిర్దేశిత స్మోకింగ్ ఏరియా లేని కారణంగా బెంగళూరు పోలీసులు సెక్షన్స్ 4, 21 కింద కేసు నమోదు చేశారు.
కోల్‌కతా శుభారంభం
అహ్మదాబాద్: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)లో తొలిసారి ఆడుతున్న కోల్‌కతా థండర్ బ్లేడ్స్ మొదటి పోరులోనే అదరగొట్టింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా..8-7తో స్టాన్లీ చెన్నై లయన్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో అంకుర్ 3-0తో కిరిల్‌ను ఓడించి కోల్‌కతాకు ఆధిక్యాన్ని అందించినా చెన్నై ప్యాడ్లర్ సికి.. 3-0తో సెలెనాను ఓడించింది.