హైదరాబాద్, ఆట ప్రతినిధి: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈనెల 10 నుంచి 17 దాకా జరిగిన ఆరో ప్రపంచ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన కే. శ్రీనివాస్ మూడు స్వర్ణాలతో మెరిశాడు. భారత్ తరఫున పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్, టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న శ్రీనివాస్.. మూడు విభాగాల్లోనూ అగ్రస్థానాన నిలిచి పసిడి పతకాలు సాదించాడు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను క్యారమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) జనరల్ సెక్రటరీ మదన్‌రాజ్, ఉపాధ్యక్షుడు సుధాకర్ ప్రత్యేకంగా అభినందించారు.