లండన్: యువ ఆటగాళ్లంతా కాసులు కురిపించే ఐపీఎల్లో తలమునకలై ఉంటే.. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా మాత్రం టెక్నిక్ మెరుగు పర్చుకునే పనిలో పడ్డాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా (115; 13 ఫోర్లు, ఒక సిక్సర్).. డర్హంతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు.
తాజా సీజన్లో ససెక్స్‌కు సారథ్యం వహిస్తున్న పుజారా తన శైలికి భిన్నంగా వేగంగా ఆడుతూ శతకం ఖాతాలో వేసుకున్నాడు. పుజారా అదరగొట్టడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. అంతకుముందు డర్హం తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. చేతిలో 3 వికెట్లు ఉన్న ససెక్స్ ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 73 పరుగులు వెనుకబడి ఉంది.