Canada Open 2023 : భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్(Lakshya Sen) సంచలనం సృష్టించాడు. తొలిసారి కెనడా ఓపెన్(Canada Open 2023) చాంపియన్‌గా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్(All England Champion) లో షి ఫెంగ్(Li Shi Feng)ని చిత్తు చేసి విజేతగా నిలిచాడు. మ్యాచ్ ఆరంభం నుంచి అద్భుతమైన ఆటతో లక్ష్యసేన్ ప్రత్యర్థిని షాక్‌కు గురి చేశాడు.
వరుస సెట్లలో జోరు కొనసాగించి 21-18, 22-20తో గెలుపొందాడు. ఈ సీజన్లో ఈ భారత షట్లర్‌కు ఇదే తొలి వరల్డ్ టూర్ టైటిల్. మొత్తంగా అతడికి రెండో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500(BWF Super 500) టైటిల్. నిరుడు జనవరిలో లక్ష్యసేన్ ఇండియా ఓపెన్ విజేతగా నిలిచాడు.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍 🏆😍
Lakshya defeated reigning All England winner 🇨🇳’s Li Shi Feng to clinch the title 🔥💥
📸: @badmintonphoto#CanadaOpen2023#IndiaontheRise#Badminton @lakshya_sen pic.twitter.com/4DIFquYoBK
— BAI Media (@BAI_Media) July 10, 2023
‘ఈ ఏడాది ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావాలనుకున్న నాకు పరిస్థితులు కలిసి రాలేదు. కెనడా ఓపెన్ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కొన్ని మ్యాచుల్లో ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. పరిస్థితులు కష్టంగా ఉండేవి. అయితే.. సిట్యుయేషన్‌కు తగ్గట్టు ఆడడం అనేది చాలా ముఖ్యం. కెనడా ఓపెన్‌లో అదే చేశాను’ అని లక్ష్యసేన్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. ప్రస్తుతం ఈ స్టార్ ఆటగాడు 19వ ర్యాంక్‌లో ఉన్నాడు.
లక్ష్యసేన్, లో షి ఫెంగ్
కెనడా ఓపెన్‌లో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగిన లక్ష్యసేన్ అంచనాలకు మించి రాణించాడు. కీలకమైన సెమీఫైనల్లో అతను 11వ సీడ్ కెంట నిషిమొటో(Kenta Nishimoto,0ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. దాంతో, రెండోసారి డబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్ ఫైనల్లో అడుగుపెట్టాడు. 44 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ నిషిమొటోపై ఆధిపత్యం చెలాయించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-17, 21-14తో గెలుపొందాడు. దాంతో, ఈ జపాన్ ఆటగాడిపై తన రికార్డును 2-1కు పెంచుకున్నాడు. ఫైనల్లోనూ దూకుడుగా ఆడి టైటిల్ సాధించాడు.