టోక్యో: అమెరికా స్టార్ స్మిమ్మర్ కాలెబ్ డ్రెస్సెల్ మరోమారు అదరగొట్టాడు. ఈత కొలనులో తనకు తిరుగులేదని చాటిచెబుతూ టోక్యో ఒలింపిక్స్లో మూడో స్వర్ణ పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల 100మీటర్ల బటర్ఫ్లై రేసును 49.45 సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని ముద్దాడాడు. దీని ద్వారా 2019 ప్రపంచ చాంపియన్షిప్లో తాను నెలకొల్పిన రికార్డు టైమింగ్(49.50సెకన్ల)ను డ్రెస్సెల్ తాజాగా తిరుగరాశాడు. మిలాక్ క్రిస్టోఫ్(49.68సె), పోంటి న్యో(50.74సె) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.