Jasprit Bumrah | దుబాయ్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అత్యున్నత రికార్డును సాధించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో బుమ్రా.. 907 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన కొనసాగుతున్నాడు. గతం లో భారత్ నుంచి అశ్విన్ మాత్రమే 904 రేటింగ్ పాయింట్లు సాధించగా తాజాగా బుమ్రా ఆ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా పేసర్లు జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్ టాప్-3లో ఉన్నారు. జైస్వాల్ ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని నాలుగో ర్యాంక్‌కు చేరాడు.