Jasprit Bumrah | ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో మూడోరోజు భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా డబుల్ ఫీట్ సాధించాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 76 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో టీమిండియా సక్సెఫుల్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
మూడో టెస్ట్‌లో రెండోరోజు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ జోడీ నాలుగో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ భాగస్వామ్యానికి బుమ్రా బ్రేక్ వేస్తూ.. ఇద్దరిని పెవిలియన్‌కు పంపాడు. కొత్త బంతితో తొలి సెషన్లో ఆస్ట్రేలియాను ఇబ్బందులకు గురి చేశాడు. ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీలను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, స్మిత్ జోడీ నాలుగో వికెట్‌కు 242 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా.. ఇద్దరిని వరుసగా ఔవుట్ చేశాడు. స్మిత్‌ను రోహిత్ శర్మ క్యాచ్ పట్టగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతికి హెడ్ చిక్కాడు. అలాగే, మిచెల్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ బుమ్రా ఒడిసిపట్టాడు.
మూడోరోజు సైతం బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మిచెల్ స్టార్క్.. బుమ్రా బౌలింగ్‌లో పంత్కి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు బుమ్రా అత్యధికంగా వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 18 వికెట్లు తీశాడు. మిస్టరీ బౌలర్ స్పెల్ బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో టీమిండియా బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఇంతకు ముందు జనవరి, 1968లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆరు వికెట్లు తీసిన ఎరపల్లి ప్రసన్నను అధిగమించాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో జస్ప్రీత్ బుమ్రా 50 టెస్ట్ వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా కంటే ఉమేశ్ యాదవ్ ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఘనత సాధించాడు. ఉమేశ్ 17 మ్యాచ్‌ల్లో 53 వికెట్లు తీశాడు. బుమ్రా కేవలం 10 మ్యాచ్‌ల్లోనే 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ఫాస్ట్ బౌలర్ సగటు 17.62 కాగా.. కపిల్‌దేవ్ రికార్డును సైతం అధిగమించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో కపిల్ దేవ్ 51 వికెట్లు పడగొట్టాడు. ఈ మూడో టెస్ట్‌లోనే ఉమేశ్, కపిల్ దేవ్‌ను అధిగమించే ఛాన్స్ ఉన్నది.