కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్లో క్రీడారంగానికి రూ.3,397.32 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది ఆఖర్లో చైనా వేదికగా జరిగే ఆసియాగేమ్స్తో పాటు పారిస్ ఒలింపిక్స్(2024) సన్నాహకాల నేపథ్యంలో బడ్జెట్లో క్రీడలకు భారీ కేటాయింపులు ఉంటాయని భావించినా.. ఆ స్థాయిలో లేకపోవడం ఒకింత నిరాశపరిచింది. గత(2,673 కోట్లు) బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి అదనంగా 723.97 కోట్లు కేటాయించారు. అయితే స్పోర్ట్స్ పవర్‌హౌజ్‌లుగా వెలుగొందుతున్న చైనా, అమెరికా బడ్జెట్లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువేనని చెప్పొచ్చు.
ఆసియా గేమ్స్, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో భారత్ ప్రదర్శన చెప్పుకోదగిన రీతిలో లేకపోవడానికి క్రీడలకు సరైన నిధులు కేటాయించక పోవడమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఖేలో ఇండియా స్కీమ్‌కు ఈసారి రూ.1045 కోట్ల నిధులు కేటాయించారు. గడిచిన కొన్ని ఏండ్లలో ఖేలో ఇండియా పత కం ద్వారా మెరుగైన ప్రతిభ కల్గిన ప్లేయర్లు వెలుగులోకి వస్తుండటం ఒకింత శుభపరిణామం. మరోవైపు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌కు రూ.325 కోట్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్‌కు రూ.325కో ట్లు, నేషనల్ స్పో ర్ట్స్ డెవలప్మెంట్ ఫం డ్కు 15 కోట్లు కేటాయించారు.
కేంద్ర వార్షిక బడ్జెట్లో క్రీడా, యువజన సంక్షేమానికి సరైన ప్రాధాన్యమివ్వలేదు. ఖేలో ఇండియా పథకానికి వెయ్యి కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. గత బడ్జెట్లో పొందుపరిచిన నిధులన్నీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఖర్చు చేసి తెలంగాణకు మొండిచేయి చూపారు. ఖేలోఇండియా నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా నిధులు లేకుండా భారీ ఆశలతో తీవ్రంగా నిరశపరిచారు. క్రీడలకు అమృత ఘడియలు ఎప్పుడు వస్తాయో కేంద్రం చెప్పాలి.
-సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్