The Hundred League : పొట్టి క్రికెట్లో దంచికొట్టుడే మంత్రగా ఆడుతున్నారు ఈతరం బ్యాటర్లు. ఐపీఎల్ (IPL) నుంచి కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) వరకూ తమ విధ్వంసక ఆటతో శతకాలు బాదేస్తూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నారు హిట్టర్లు. ఇంగ్లండ్ గడ్డ మీద జరుగుతున్న ‘ది హండ్రెడ్ లీగ్’ (The Hundred League)లోనూ సెంచరీల పర్వం లిఖిస్తున్నారు కొందరు. పురుషులకు దీటుగా ఆకాశమే హద్దుగా ఆడుతున్న మహిళా బ్యాటర్లు మూడంకెల స్కోర్‌తో రెచ్చిపోతున్నారు.
వంద బంతుల ఈ లీగ్‌లో ‘మేమూ రికార్డులు బ్రేక్ చేయగలం’ అని చాటుతూ సెంచరీతో చరిత్ర సృష్టించారు ఈ ఇద్దరు. ఒకరు ఇంగ్లండ్ స్టార్ టమ్మీ బ్యూమంట్(Tammy Beaumont) కాగా.. మరొకరు ఆ దేశానికే చెందిన 18 ఏళ్ల డవినా పెర్రిన్(Davina Perrin). ఈ లీగ్ చరిత్రలో టాప్ -5 వేగవంతమైన శతకం బాదిన బ్యాటర్ల జాబితాలో ఈ ఇద్దరూ చోటు దక్కించుకోవడం విశేషం.
The moment Davina Perrin scored 1️⃣0️⃣0️⃣ runs.
Watched on by her family and a packed The Kia Oval 💜#TheHundredEliminator pic.twitter.com/L5x7W5WXau
— The Hundred (@thehundred) August 30, 2025
ఈమధ్యే పాపులర్ అవుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో సెంచరీల మోత మోగిస్తున్నారు బ్యాటర్లు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) నార్తర్న్ సూపర్ చార్జర్స్ తరఫున 41 బంతుల్లోనే వంద కొట్టి రికార్డు నెలకొల్పగా.. డవీనా పెర్రిన్ బౌలర్లను ఊచకోత కోస్తూ శతకంతో చెలరేగింది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ఆడుతున్న ఈ యువ బ్యాటర్ ఎలిమినేటర్ పోరుతో సివంగిలా పంజా విసిరి 42 బంతుల్లోనే సెంచరీకి చేరువైంది. తద్వారా మహిళల ది హండ్రెడ్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిందీ డేరింగ్ హిట్టర్.
Only two women have scored centuries in the Hundred:
Tammy Beaumont – 118 vs Trent Rockets, 2023
𝗗𝗮𝘃𝗶𝗻𝗮 𝗣𝗲𝗿𝗿𝗶𝗻 – 𝟭𝟬𝟭 𝘃𝘀 𝗟𝗼𝗻𝗱𝗼𝗻 𝗦𝗽𝗶𝗿𝗶𝘁, 𝘁𝗼𝗱𝗮𝘆#TheHundred pic.twitter.com/oHNWfpeWLP— ESPNcricinfo (@ESPNcricinfo) August 30, 2025
పెర్రిన్ కంటే ముందు టమ్మీ బ్యూమంట్ ఈ లీగ్‌లో వంద కొట్టింది. రెండేళ్ల క్రితం ‘ది వెల్ష్ ఫైర్'(The Welch Fire) జట్టు తరఫున ఈ రైట్ హ్యాండర్ 52 బంతుల్లో శతక గర్జన చేసి.. తొలి సెంచూరియన్‌గా రికార్డు పుస్తకాల్లో చేరింది. కానీ.. ఐదో సీజన్లో పెర్రిన్ ఆమె రికార్డును బద్ధలు కొడుతూ వేగవంతమైన శతకంతో సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకైతే మహిళల ది హండ్రెడ్ లీగ్‌లో సెంచరీ బాదింది ఈ ఇద్దరు మాత్రమే.
పురుషుల, మహిళల ది హండ్రెడ్ లీగ్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది ఎవరంటే..హ్యారీ బ్రూక్ (నార్తర్న్ సూపర్ఛార్జర్స్) – 41 బంతుల్లో, డవీనా పెర్రిన్ (నార్తర్న్ సూపర్ఛార్జర్స్) – 42 బంతుల్లో, విల్ జాక్స్(ఓవల్ ఇన్విసిబుల్స్) – 47 బంతుల్లో, విల్ స్మీడ్ (బర్మింగ్హమ్ ఫీనిక్స్) – 49 బంతుల్లో, టమ్మీ బ్యూమంట్(ది వెల్ష్ ఫైర్) – 52 బంతుల్లో వంద కొట్టేశారు.
Fastest centuries in #TheHundred (by balls):
41 – Harry Brook
𝟰𝟮 – 𝗗𝗮𝘃𝗶𝗻𝗮 𝗣𝗲𝗿𝗿𝗶𝗻
47 – Will Jacks
49 – Will Smeed
52 – Tammy Beaumont pic.twitter.com/bpzTO29OIG— ESPNcricinfo (@ESPNcricinfo) August 30, 2025