NZ vs ENG : స్వదేశంలో జరగుతున్న టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ (Newzealand)కు మరోషాక్. తొలి పోరును వర్షం అడ్డుకోగా.. క్రిస్ట్‌చర్చ్‌లో ఇంగ్లండ్ (England) బ్యాటర్లు పరుగుల వరదతో హడలెత్తించారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్(85), కెప్టెన్ హ్యారీ బ్రూక్(78)లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కగా ఇంగ్లండ్ 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ ఛేదనలో కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (37), సాంట్నర్(36) పోరాడినా ఆదిల్ రషీద్(4-32) దెబ్బకు ఆతిథ్య జట్టు కొలుకోలేకపోయింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన బ్రూక్ సేన 65 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌లో ముందంజ వేసింది.
పొట్టి క్రికెట్లో చెలరేగిపోయే హిట్టర్లతో నిండిన ఇంగ్లండ్ మరోసారి తడాఖా చూపించింది. న్యూజిలాండ్ పర్యటనలో మొదటి మ్యాచ్ వర్షార్పణం అయినా.. రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడే మంత్రగా విరుచుకుపడిన ఫిల్ సాల్ట్ (85).. హ్యారీ బ్రూక్ (78) మెరుపులతో భారీ స్కోర్ చేసిన ఇంగ్లండ్.. ప్రత్యర్థిని కట్టడి చేసి సిరీస్‌లో అదిరే బోణీ కొట్టింది.
Just Harry Brook doing what he does best. 👌 #SonySportsNetwork #NZvENG pic.twitter.com/074C83i5xY
— Sony Sports Network (@SonySportsNetwk) October 20, 2025
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు టాపార్డర్ భారీ స్కోర్ అందించారు. విధ్వంసక ఆటకు కేరాఫ్ అయిన ఫిల్ సాల్ట్ (85) హాఫ్ సెంచరీ గట్టి పునాది వేశాడు. అతడిచ్చిన శుభారంభంతో రెచ్చిపోయాకు సారథి హ్యారీ బ్రూక్(78). ఆఖర్లో సామ్ కరణ్ (8 నాటౌట్), టామ్ బ్యాంటన్(29 నాటౌట్) ధనాధన్ ఆడగా ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 236 స్కోర్ చేసింది.కొండంత ఛేదనలో న్యూజిలాండ్ ఆది నుంచి తడబడింది.
రెండో ఓవర్లోనే ఓపెనర్ టిమ్ రాబిన్సన్(7)ను కార్సే ఔట్ చేయగా.. దంచేస్తున్న సీఫర్ట్ (37)ను ఆదిల్ రషీద్ ఔట్ చేసి మరోషాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర(8)ను కార్సే వెనక్కి పంపగా.. చాప్మన్((28)ను ఆట కట్టించాడు డాసన్. అక్కడి నుంచి కివీస్ బ్యాటర్లు పరుగుల చేసేందుకు చెమటోడ్చారు. మిడిలార్డర్‌ను రషీద్ చుట్టేయగా.. టెయిలెండర్లను ల్యూక్ వుడ్ వెనక్కి పంపించాడు. దాంతో.. 171 పరుగులకే కివీస్ ఆలౌటయ్యింది. ఈ మ్యాచ్‌లో రికార్డు ఏంటంటే.. పది మంది క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరిగారు. టీ20ల్లో ఇప్పటివరకూ ఇలా జరగడం పదమూడోసారి. ఇరుజట్ల మధ్య అక్టోబర్ 23న ఆక్లాండ్‌లో మూడో టీ20 జరుగనుంది.