SA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రి (South Africa) పొట్టి క్రికెట్లోనూ రికార్డులు తిరగరాస్తోంది. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాను చిత్తు చేసి తొలిసారి ఐసీసీ టైటిల్ గెలుపొందిన సఫారీ టీమ్ ఈసారి ఆసీస్‌పైనే రికార్డు స్కోర్ బాదింది. టీ20ల చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసింది మర్క్రమ్ బృందం. యువకెరటం డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) విధ్వంసక శతకంతో చెలరేగగా 218 పరుగులు చేసింది ప్రొటీస్ టీమ్. గతంలో కంగారూ జట్టుపై 204 అత్యధికంగా ఉండేది. డార్విన్ మైదానంలో మంగళవారం జూనియర్ డివిలియర్స్ వీరకొట్టుడు కొట్టడంతో 9 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
ఈ రోజుల్లో పొట్టి క్రికెట్లో రెండొందలు కొట్టడం సాధారణం అయిపోయింది. ప్రతి సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనైనా 200 ప్లస్ స్కోర్ నమోదవుతోంది. డబ్ల్యూటీసీ ఛాంపియన్ దక్షిణాఫ్రికా ఈసారి విధ్వంసక ఆటతో 218 రన్స్ బాదింది. బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాపై డెవాల్డ్ బ్రెవిస్ (125 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో కొండంత స్కోర్ చేసింది.
South Africa reached their highest-ever total against Australia in men’s T20Is 💪 pic.twitter.com/gK4pfmwSk3
— ESPNcricinfo (@ESPNcricinfo) August 12, 2025
దిగ్గజ బ్యాటర్ డివిలియర్స్‌ను తలపడించే ఆటతో ఈ యంగ్‌స్టర్ 56 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్సర్లతో శతకగర్జన చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్(31) మెరుపులు తోడవ్వడంతో ప్రొటీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారీ స్కోర్ చేసింది. గతంలో రెండు పర్యాయాలు కంగారూలపై రెండొందలు కొట్టింది దక్షిణాఫ్రికా. 2016లో జొహన్నెస్‌బర్గ్ మైదానంలో 204 -7, ఇదే గ్రౌండ్లో 2006లో 201-4 స్కోర్ బాదింది సఫారీ టీమ్.
Dewald Brevis: South Africa’s youngest T20I centurion ⭐ pic.twitter.com/ET1d7h146p
— ESPNcricinfo (@ESPNcricinfo) August 12, 2025