డార్విన్: బేబీ ఏబీడీగా అభిమానులు పిలుచుకుంటున్న దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (56 బంతుల్లో 125 నాటౌట్, 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో సఫారీలు ఘనవిజయం సాధించారు.
బ్రెవిస్.. 41 బంతుల్లోనే శతకం బాదగా (సౌతాఫ్రికా తరఫున రెండో వేగవంతమైన).. స్టబ్స్ (31) రాణించడంతో తొలుత సౌతాఫ్రికా 218/7 స్కోరు చేసింది. హాజిల్‌వుడ్, జంపా, మ్యాక్స్‌వెల్, అబాట్‌ను క్లబ్ స్థాయి బౌలర్లుగా మార్చుతూ బ్రెవిస్ చెలరేగిపోయాడు. అనంతరం ఛేదనలో ఆసీస్.. 17.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది.