ప్రపంచ క్రికెట్లో బెస్ట్ పేసర్ల పేర్లు చెప్పమంటే కచ్చితంగా ఆ జాబితాలో ఉండే పేరు బ్రెట్ లీ. ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్రత్యర్థులను ఎంతలా భయపెట్టాడో అందరికీ తెలిసిందే. అంతటి ఘనుడైన బ్రెట్ లీ తన కెరీర్లో ఎవరికి బౌలింగ్ వేయడానికి ఇబ్బంది పడేవాడు? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది.
Catching up with my friend @BrettLee_58 . The most in demand interview, people always asked me for this. Here he is, telling it all.
— Shoaib Akhtar (@shoaib100mph) February 1, 2022
Pace, life, Pakistan & Indian Cricket. Enjoy & give feedback.
Tap here: https://t.co/26P6hETuJb pic.twitter.com/mIh5Sm4MgC
దీనికి తాజాగా స్వయంగా బ్రెట్ లీనే సమాధానం చెప్పాడు. మరో స్టార్ పేసర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన బ్రెట్ లీ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ప్రపంచ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ వేయడం తనకు నచ్చేది కాదని బ్రెట్ లీ వెల్లడించాడు. సచిన్ అద్భుతమైన ఆటగాడని, అతని టెక్నిక్ అత్యుత్తమంగా ఉంటుందని కొనియాడాడు.
1999లో భారత్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులోనే బ్రెట్ లీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ ఇన్నింగ్సులో ఏకంగా ఐదు వికెట్లు తీసి అబ్బురపరిచాడు. అయితే ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆ తర్వాత 2008లో సీబీ సిరీస్‌లో బ్రెట్ లీ వేసిన ఒక ఓవర్లో మూడు స్ట్రెయిట్ డ్రైవ్స్ ఆడాడు.
అయితే ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య వార్ ఎప్పుడూ వన్ సైడ్‌గా లేదు. బ్రెట్‌లీ బౌలింగ్‌లో సచిన్ చాలాసార్లు అద్భుతమైన షాట్లు ఆడాడు. అయితే బ్రెట్ లీ కూడా తక్కువేం తినలేదు. తన కెరీర్లో సచిన్‌ను ఏకంగా 14 సార్లు అవుట్ చేశాడీ స్పీడ్‌స్టర్.
@sachin_rt Vs @BrettLee_58 always been a fascinating contest over the years 🤠 pic.twitter.com/z1gd2lnEQ9
— JAMES (@ImJames_) May 8, 2020