ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శనలతో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో ఆ జట్టు ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఆ జట్టు టెస్టు సారధి జో రూట్.. తన పదవిని వదులుకున్నాడు. కొత్త సారధిగా బెన్ స్టోక్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నియమించింది. అలాగే త్వరలోనే కొత్త కోచ్‌ను నియమిస్తామని తెలిపింది. ఇప్పుడు న్యూజిల్యాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్‌ను ఇంగ్లండ్ కోచ్‌గా నియమించినట్లు ఆ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
‘‘ఆ జట్టును మరింత బలమైన శక్తిగా మార్చే సత్తా నాకుందని నమ్ముతున్నా’’ అని ఈ సందర్భంగా మెకల్లమ్ అన్నాడు. అలాగే బెన్ స్టోక్స్ పర్ఫెక్ట్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, చుట్టూ ఉన్న వారిలో మార్పు తీసుకొచ్చే గుణం అతనిలో ఉందని చెప్పాడు. స్టోక్స్‌తో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు. మరి మెకల్లమ్ రాకతో అయినా ఇంగ్లండ్ ఆటతీరు మారుతుందేమో చూడాలి. అయితే ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్‌గా మెకల్లమ్ పెద్దగా ప్రభావం చూపని సంగతి తెలిసిందే.