Mathew Breetzke : ఈ కాలం కుర్రాళ్లు ఫార్మాట్ ఏదైనా పవర్ హిట్టింగ్తో బెంబేలెత్తిస్తున్నారు. ప్రత్యర్థి బౌలర్ ఎంతటివాడైనా సరే ఉతికారేస్తూ భారీ స్కోర్లు సాధిస్తున్నారు. తమదైన దూకుడు, నిలకడతో దిగ్గజ క్రికెటర్లకు సాధ్యంకాని రికార్డులను తమ పేరిట రాసుకుంటున్నారు. వన్డేల్లో నయా సంచలనంగా దూసుకొస్తున్న మాథ్యూ బ్రీట్జ్ (Mathew Breetzke) ఇప్పుడు అలాంటి రికార్డే సృష్టించాడు.
దేశవాళీలో మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన బ్రీట్జ్ అంతర్జాతీయ మ్యాచుల్లోనూ తన సత్తా చూపిస్తున్నాడు. ఇప్పటికే తన స్టయిల్ విధ్వంసంతో వార్తల్లో నిలిచిన అతడు ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో 88 పరుగులతో రెచ్చిపోయాడు. వరుసగా నాలుగు వన్డేల్లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్ బాదిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.1974 నుంచి ఇప్పటివరకూ ఎందరో స్టార్లు పుట్టుకొచ్చినా.. తనకు మాత్రమే సాధ్యమంటూ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడీ సఫారీ కుర్రాడు.
Matthew Breetzke does it again! 🔥
He brings up his 4th consecutive ODI half-century; what a blistering start to an exciting international career. 👏🇿🇦
Well played, Matthew! 🏏✨ #WozaNawe pic.twitter.com/YwdkZqJH1o
— Proteas Men (@ProteasMenCSA) August 22, 2025
ఆరు నెలల క్రితమే వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన బ్రీట్జ్ తన బ్యాటింగ్‌తో భావితారగా ప్రశంసలు అందుకుంటున్నాడు. న్యూజిలాండ్‌పై అరంగేట్రం చేసిన అతడు సూపర్ సెంచరీతో తన విధ్వంసం ఎలా ఉంటుందో చాటాడు. బౌండరీల మోతతో.. 150 పరుగులతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ యంగ్ బ్యాటర్ ఆపై పాకిస్థాన్ మీద తన ప్రతాపం చూపించాడు. 83 రన్స్‌తో పాక్ బౌలర్లను భయపెట్టిన బ్రీట్జ్.. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌లోనూ కంగారూ బౌలర్లను వణికిస్తూ అర్ధ శతకాలు బాదేస్తున్నాడీ హిట్టర్.
No player has more runs in their first four men’s ODI innings than Matthew Breetzke 🔝 🇿🇦 pic.twitter.com/k1BwJx8118
— ESPNcricinfo (@ESPNcricinfo) August 22, 2025
తొలి వన్డేలో 58 రన్స్ కొట్టిన ఈ చిచ్చరపిడుగు.. రెండో మ్యాచ్‌లో నూ ఆకాశమే హద్దుగా ఆడి సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో, వరుసగా నాలుగు వన్డే మ్యాచుల్లో హాఫ్ సెంచరీ ప్లస్ కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్రపుటల్లోకి ఎక్కాడీ యువకెరటం. బ్రీట్జ్ మెరుపులతో 277 రన్స్ చేసిన సఫారీ టీమ్.. అనంతరం ఎంగిడి విజృంభణతో ఆసీస్‌ను ఆలౌట్ చేసి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.