మెల్బోర్న్: మెల్బోర్న్ క్రికెట్ మైదానం(Boxing Day Test)లో కొత్త రికార్డు నమోదు అయ్యింది. అత్యధిక సంఖ్యలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ను ప్రేక్షకులు వీక్షించారు. సుమారు 3,73,691 మంది మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించినట్లు రికార్డు నమోదైంది. బ్రాడ్‌మ్యాన్ కాలం నాటి రికార్డును ప్రేక్షకులు బ్రేక్ చేసినట్లు చెబుతున్నారు.
One of the, if not THE greatest Test matches of all time.
370,000 people at the MCG.
Just epic. Privilege to have been here to witness it.
Mind BLOWN. 🤯@7Cricket | #AUSvIND
— Trent Copeland (@copes9) December 30, 2024
ఎంసీజీలో ఇంత సంఖ్యలో ప్రేక్షకులు హాజరుకావడం ఇదే మొదటిసారి. ఇవాళ ఫైనల్ రోజు అత్యధికంగా 74,362 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించారు. దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్‌మ్యాన్ కాలంలో కూడా ఈ స్థాయిలో ప్రేక్షకులు ఎంసీజీ చేరుకోలేదని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
మొత్తం అయిదు రోజుల్లో 373,691 మంది హాజరైనట్లు ఎంసీజీ అధికారులు తేల్చారు. ప్రతి రోజు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఆసక్తికరంగా సాగిన ఫైనల్ రోజు.. భారత్ చివరి సెషన్లో తడబడింది. ఆ సెషన్లో ఏడు వికెట్లును కోల్పోయింది. దీంతో ఇండియా 184 రన్స్ తేడాతో బాక్సింగ్ డే టెస్టులో ఓటమి చవిచూసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్నది. జనవరి 3వ తేదీ నుంచి అయిదవ టెస్టు మ్యాచ్ జరగనున్నది.
87 ఏళ్ల క్రితం బ్రాడ్‌మాన్ ఆడుతున్న రోజుల్లో భారీ సంఖ్యలో ఎంసీజీకి ప్రేక్షకులు వచ్చారు. 1937లో ఇంగ్లండ్‌తో ఆరు రోజుల పాటు జరిగిన టెస్టు మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో వీక్షించారు. ఆ మ్యాచ్‌ను సుమారు 350534 మంది వీక్షించారు. ఇప్పుడు ఆ రికార్డును భారత్, ఆసీస్ మ్యాచ్ బ్రేక్ చేసింది.
The MCG has smashed the all-time attendance record for a Test in Australia.https://t.co/6J6p37UC8x
— cricket.com.au (@cricketcomau) December 30, 2024