ఢిల్లీ: దేశ రాజధానిలో వాయుకాలుష్యం కారణంగా ఈనెల 31 నుంచి జనవరి 6 దాకా జరుగబోయే 9వ ఎలైట్ మెన్స్, ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ టోర్నీ వాయిదాపడింది. ఢిల్లీలో ప్రభుత్వం అమలుచేస్తున్న కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ టోర్నీని వాయిదావేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈనెల 31 దాకా ఢిల్లీలో పరిమితమైన కార్యక్రమాల నిర్వహణకే అనుమతి ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ వాయిదాపడింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఈవెంట్‌ను జనవరి 4 నుంచి 10 దాకా గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో నిర్వహించనున్నారు.