పారిస్: అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్(Imane Khelif) పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. జెండర్ ఎలిజిబిలిటీ టెస్టులో విఫలమైన ఆ బాక్సర్.. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల విభాగంలో పోటీపడుతున్నారు. ఇమేని పంచ్‌లు తట్టుకోలేకపోయిన ఇటలీ బాక్సర్ మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది. ఆ తర్వాత కూడా ప్రతి రౌండ్లో ప్లేయర్లు ఇమేని పంచ్‌లకు భీతిల్లిపోతున్నారు. కానీ ఇమేనీ మాత్రం పట్టుదలతో ముందుకు దూసుకెళ్తోంది. సెమీఫైనల్లో జంజేమ్ సువాన్నపెంగ్పై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌లోనే ఇంటి ముఖం పట్టిన ఇమేనీ ఈసారి మాత్రం ఫైనల్లోకి ప్రవేశించి పసిడి పతకంపై కన్నేసింది. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి లియూ యాంగ్తో తలపడనున్నది.
Imane Khelif is an Olympic finalist….contending for a gold medal….in women’s boxing….as a male.
Why have women’s sports at all if any mediocre male can compete in them?pic.twitter.com/MO2t1lVVnP
— Riley Gaines (@Riley_Gaines_) August 6, 2024