IPL 2025 : వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ(36) రెచ్చిపోతున్నాడు. బౌండరీలతో ముంబై ఇండియన్స్ బౌలర్లను చితకబాదేస్తున్నాడు. తొలి ఓవర్లోనే ఫిలిప్ సాల్ట్(4) బౌల్డ్ అయినా.. స్కోర్ వేగం తగ్గకుండా ఆడతున్నాడు విరాట్. దేవ్‌దత్ పడిక్కల్(32) జతగా కీలక ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. చాహర్ వేసిన 6వ ఓవర్లో పడిక్కల్ వరుసగా 6, 6, 4 బదడంతో 20 పరుగులు వచ్చాయి. దాంతో, ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి ప74 రుగులు చేసింది.
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వికెట్ తీసే అలవాటున్న ట్రెంట్ బౌల్ట్ బెంగళూరుకు ఆదిలోనే షాకిచ్చాడు. రెండో బంతికే డేంజరస్ ఫిలిప్ సాల్ట్(4)ను బౌల్డ్ చేసి ముంబైకి బ్రేకిచ్చాడు. ఈ స్పీడ్‌స్టర్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీయడం 31వ సారి. 4 పరుగులకే తొలి వికెట్ పడిన వేళ.. విరాట్ కోహ్లీ(36) జట్టుపై ఒత్తిడి పడనీయలేదు. చాహర్ బౌలింగ్‌లో 4 కొట్టిన విరాట్.. ఆపై బౌల్ట్ బౌలింగ్‌లోనూ రెండుసార్లు బంతిని బౌండరీకి పంపాడు. విల్ జాక్స్ వేసిన 5వ ఓవర్లో కోహ్లీ ఫోర్ కొట్టగా ఆర్సీబీ స్కోర్ 50కి చేరింది.
Boult with the early blow 💙
Kohli in full flow ❤️#RCB are 43/1 after 4 overs.Updates ▶️ https://t.co/Arsodkwgqg#TATAIPL | #MIvRCB | @mipaltan | @RCBTweets | @imVkohli pic.twitter.com/R6Ky7fdnHX
— IndianPremierLeague (@IPL) April 7, 2025