ఢిల్లీ : భారత యువ షట్లర్ బొర్నిల్ ఆకాశ్ చాంగ్మై ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించాడు. పురుషుల అండర్ -15 విభాగంలో పదేండ్ల నిరీక్షణకు తెరదించుతూ.. స్వర్ణం పతకం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన ఫాన్ హాంగ్ జియాన్‌ను చిత్తుగా ఓడించాడు. తొలిసెట్లోప్రత్యర్థి గట్టిగానే ప్రతిఘటించినా.. బొర్నిల్ పట్టువిడువకుండా పోరాడాడు.
ఇక రెండో సెట్లో జియాన్ చేతులెత్తేయడంతో బొర్నిల్ 21-19, 21-13తో గెలుపొందాడు. తద్వారా ఈ విభాగంలో సిరిల్ వర్మ అనంతరం పతకం గెలిచిన రెండో భారతీయుడిగా బొర్నిల్ రికార్డు నెలకొల్పాడు. మహిళల అండర్ -17 విభాగంలో తన్వీ శర్మ రజతంతో సరిపెట్టుకుంది. ఆఖరి వరకూ హోరాహోరీగా జరిగిన ఫైనల్లో థాయ్‌లాండ్ షట్లర్ యతవీమిన్ కెత్క్లియెంగ్ చేతిలో 17-21, 21-11, 19-21 తేడాతో ఓటమి పాలైంది. ఈ విభాగంలో ఉన్నాతి హుడా తర్వాత వెండి పతకం గెలిచిన రెండో భారత క్రీడాకారిణిగా తన్వీ రికాడ్డు సొంతం చేసుకుంది.