Wimbledon 2023 : మిక్స్డ్ డబుల్స్‌లో నిరాశపరిచిన రోహన్ బోపన్న(Rohan Bopanna) పురుషుల డబుల్స్(Mens Doubles)లో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్(Matthew Ebden)తో జోడీ కట్టిన బోపన్న మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. బోపన్న ద్వయం ఈరోజు బ్రిటన్‌కు చెందిన జాకొబ్ ఫియర్న్లే(Jacob Fearnley), జొహన్నస్(Johannus) జోడీని వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా భారత స్టార్, ఎబ్డెన్ 7-5, 6-3తో గెలుపొందారు.
ఈ మ్యాచ్‌లో బోపన్న – మాథ్యూ ఎబ్డెన్ 87 శాతం పాయింట్లు సాధించారు. అంతేకాదు రెండు అనవసర తప్పిదాలు మాత్రమే చేశారు. తర్వాతి రౌండ్లో అర్జెంటీనాకు చెందిన గుల్లెర్మో డ్యురాన్, థామస్ మార్టిన్ ఎట్చ్వెర్రీ జోడీతో బోపన్న జంట తలపడనుంది.
బోపన్న – గాబ్రియెల డబ్రోవ్స్కీ

మిక్స్డ్ డబుల్స్(Mixed Doubles)లో రోహన్ బోపన్న(Rohan Bopanna) జోడికి చుక్కెదురైంది. ఆరో సీడ్ బోపన్న, గాబ్రియెల డబ్రోవ్స్కీ(Gabriela Dabrowski) రెండో రౌండ్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు. మాజీ వింబుల్డన్ చాంపియన్ ఇవన్ డోడిగ్(Ivan Dodig), లతిశ చాను(Latisha Chan) చేతిలో వరుస సెట్లలో 7-6 (7-5), 3-6, 4-6తో పరాజయం పాలయ్యారు.