ATP Finals 2024 : భారత డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న (Rohan Bopanna) మరోసారి విఫలమయ్యాడు. స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్(ATP Finals 2024)లో వరుసగా రెండో ఓటమి చవిచూశాడు. బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో బోపన్న – మాథ్యూ ఎబ్డెన్ల ద్వయానికి గట్టి షాక్ తగిలింది. మార్సెలో అరెవెలో, మటే పవెక్ జోడీ ధాటికి బోపన్న జోడీ చేతులెత్తేసింది.
ఏటీపీ ఫైనల్స్లో బోపన్న జోడీకి కలిసి రావడం లేదు. తొలి మ్యాచ్లో ఇటలీ జంట అండ్రియా వవస్సొరి, సిమొనె బెలెల్లీ చేతిలో బోపన్న – ఎబ్బెన్ ద్వయం చిత్తుగా ఓడింది. ఆఖరిదాకా పోరాడినప్పటికీ 5-7, 3-6తో మ్యాచ్ చేజార్చుకుంది.
2nd consecutive loss for Bopanna/Ebden in prestigious ATP Finals.
They lost to top seeds Arevalo & Pavic 5-7, 3-6 in their 2nd Group stage clash.
They will take on 8th seeds Krawietz/Pütz tomorrow in their final group stage match. #ATPFinals pic.twitter.com/umRTMxle3c
— India_AllSports (@India_AllSports) November 13, 2024
కనీసం రెండో మ్యాచ్లో అయినా విజయంతో టోర్నీలో బోణీ కొట్టాలనుకున్న బోపన్న ద్వయం కల నెరవేరలేదు. అరెవెలో, పవెక్ జంట అద్భుతంగా ఆడింది. దాంతో, వరుసగా రెండు సెట్లలో 5-7, 3-6తో పరాజయం మూటగట్టుకొన్న బోపన్న – హెబ్డేల జంట గ్రూప్లో అట్టడుగున నిలిచింది. ఇక గురువారం బోపన్న జోడీ కెవిన్ క్రావిట్జ్, టిమ్ పట్జ్లను ఢీ కొననుంది.