Raashi Khanna | తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కథానాయికలలో రాశీఖన్నా (Raashi Khanna) ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలు చేసిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్‌కు షిప్ట్ అయిన విషయం తెలిసిందే. 2022లో పక్కా కమర్షియల్, థ్యాంక్యూ అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక 2023లో అయితే తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదలవ్వలేదు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో చేస్తున్న చిత్రం తెలుసు కదా (Telusu Kada) యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) డైరెక్షన్లో ఈ సినిమా వస్తోంది.
ఇదిలావుంటే ప్రస్తుతం రాశీ బాలీవుడ్లో చేస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’(The Sabarmati Report). విక్రాంత్ మాస్సే కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. తన పర్సనల్ విషయాలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
నా లైఫ్‌లో కూడా లవ్ స్టోరీ ఉండేది అని వెల్లడించింది. నేను అతడు కొన్ని రోజులు బాగానే ఉన్నాం ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థాల కారణంగా బ్రేకప్ అయ్యింది. అతడితో బ్రేకప్ తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయా. అయితే కొన్నాళ్ల తర్వాత నా స్నేహితులు, బంధువుల సాయంతో నా కెరీర్‌పై దృష్టి పెట్టి నా బ్రేకప్ నుంచి బయటపడ్డాను. సినిమాల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన కూడా ఇప్పటికి నాకు ఫిలిం ఇండస్ట్రీలో కంటే బయట ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ రాశీఖన్నా చెప్పుకోచ్చింది.