కైరో: ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. పోటీల తొలి రోజైన శనివారం జరిగిన పురుషుల 50మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ రవీందర్‌సింగ్ పసిడి పతకంతో పాటు రజతంతో మెరువగా, ఎలావెనిల్ వాలరివన్ కాంస్యం ఖాతాలో వేసుకుంది. పురుషుల వ్యక్తిగత విభాగం తుదిపోరులో రవీందర్ 569 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అదే జోరు కొనసాగిస్తూ టీమ్ విభాగంలో రవీందర్(569) రజతం కైవసం చేసుకున్నాడు. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఎలావెనిల్ 232.0 స్కోరుతో మూడో స్థానంతో కాంస్యం దక్కించుకుంది.