IPL 2024 | ఆరంభ వేడుకలు షురూ.. బాలీవుడ్ హీరోల డాన్స్‌లు, రెహమాన్ పాటలతో హోరెత్తిన చెపాక్
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. 295 రోజుల తర్వాత వచ్చిన ఈ క్రికెట్ పండుగలో ఫ్యాన్స్‌ను అలరించేందుకు స్టార్ ఆటగాళ్లు సిద్దమయ్యారు. దాంతో, ఈ మెగా టోర్నీ ఆరంభ వేడుకల్ని బీసీసీఐ గట్టిగా ప్లాన్ చేసింది. బాలీవుడ్ హీరోలు అక్షయ్..
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. 295 రోజుల తర్వాత వచ్చిన ఈ క్రికెట్ పండుగలో ఫ్యాన్స్‌ను అలరించేందుకు స్టార్ ఆటగాళ్లు సిద్దమయ్యారు. దాంతో, ఈ మెగా టోర్నీ ఆరంభ వేడుకల్ని బీసీసీఐ గట్టిగా ప్లాన్ చేసింది. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్(Akshay Kumar), టైగర్ ష్రాఫ్‌లు జాతీయ జెండాతో ఎంట్రీ ఇచ్చారు. కండ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగుల్లో బాలీవుడ్ పాటలకు హుషారుగా స్టెప్పులేశారు.
‘వార్’ సినిమాలోని ‘జై జై శివ శంకర్’, దేశీ బాయ్స్ పాటకు అక్షయ్, టైగర్లు ఇరగదీసే నృత్యంతో స్తూ స్టేడియాన్ని హోరెత్తించారు. ఆ తర్వాత స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్(AR Rehman), సింగర్ సోనీ నిగమ్‌లు తమ మ్యాజిక్‌తో మాయ చేశారు. రెహ్మాన్ ‘మాతుజే సలామ్’ పాట అందుకోగానే స్టేడియం ఊగిపోయింది.
Exclusive video from #TATAIPL2024
MEGASTAR #AkshayKumar𓃵 and #tigershroff‘s performance started#BadeMiyanChoteMiyanOnEid2024 pic.twitter.com/6FMoDcnvVa
— SHASHWAT~ (@AKKI_KA_FAN_) March 22, 2024
ఆ తర్వాత మోహిత్ చౌహన్, నీతూ మోహన్‌లు మైక్ అందుకున్నారు. హుషారెత్తించే పాటలతో ఫ్యాన్స్‌ను సంగీత ప్రపంచంలో ఓలలాడించారు. అనంతరం రెహమాన్‌తో కలిసి అందరూ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలోని ‘జయహో’ పాట పాడారు. దాంతో స్టేడియంలోని అభిమానులంతా జయహో అంటూ గొంతు కలిపారు. ఐపీఎల్ ఆరంభ పోరు కావడంతో చెపాక్ స్టేడియం ఆర్సీబీ, సీఎస్కే అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇంకెందుకాలస్యం ఐపీఎల్ ఆరంభ సీజన్ వేడుకల్ని స్టార్ స్పోర్ట్స్ 1, జియో సినిమా యాప్‌లో లైవ్‌గా చూసేయండి మరి.
𝙰 𝙼𝚞𝚜𝚒𝚌𝚊𝚕 𝙼𝚊𝚜𝚝𝚎𝚛𝚢 🎶@arrahman has left everyone in awe of his brilliance at the #TATAIPL Opening Ceremony 😍 🙌 pic.twitter.com/tbiiROXdog
— IndianPremierLeague (@IPL) March 22, 2024
విజయోత్సాహం ఎవరిదో..?
ఐపీఎల్ ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు టోర్నీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. చెపాక్ స్టేడియంలో రాత్రి 8:00 గంటలకు మ్యాజ్ జరుగనుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథిగా తొలి మ్యాచ్ ఆడనుండగా.. విజయంతో టోర్నీని ఆరంభించాలని ఆర్సీబీ భావిస్తోంది. ఒకవైపు ఐదుసార్లు చాంపియన్.. మరోవైపు మూడుసార్లు ఫైనలిస్ట్. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు హేమాహేమీలే. స్టార్లకు కొదవలేని సమఉజ్జీల పోరులో విజయం ఎవరిని వరిస్తుంది? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇవి కూడా చదవండి
- India Alliance | ప్రతిపక్షాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ECI కి ఇండియా కూటమి ఫిర్యాదు..
- Sri Ranga Neethulu | యూత్ ని ఆకట్టుకునేలా ‘శ్రీరంగనీతులు’ సెకండ్ సింగిల్
- Nirmal | విషాదం : వీధి కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

