ముంబై: టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. సూర్య తనకు తరుచూ మెసేజ్‌లు చేసేవాడని ఆమె ఎంటీవీ స్ప్లిట్స్ విల్లాలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీరు ఎవరైనా క్రికెటర్లతో రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ‘లేదు. నేను ఏ క్రికెటర్‌తో డేటింగ్ చేయాలనుకోవడం లేదు. నన్ను చాలామంది క్రికెటర్లు ఫాలో అవుతుంటారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ నాకు తరుచూ మెసేజ్‌లు చేసేవాడు. కానీ ఇప్పుడు మేం మాట్లాడుకోవడం లేదు’ అని తెలిపింది. ఖుషీ చేసిన వ్యాఖ్యలపై సూర్య స్పందించాల్సి ఉంది.