Bob Carter : క్రికెట్లో హెడ్‌కోచ్‌గా ఎవరైనా పదేండ్లు ఉంటేనే గొప్ప. అలాంటిది బాబ్ కార్టర్ (Bob Carter) ఏకంగా 21 ఏళ్లు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. సుదీర్ఘ కాలం న్యూజిలాండ్ (Newzealand) జట్టుకు సేవలందించిన ఆయన శుక్రవారం తన పదవికి గుడ్ బై చెప్పాడు. మొదట ప్రధాన కోచ్‌గా.. అపై హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా పనిచేసి.. తమ దేశంలో మహిళ క్రికెట్ పురోగతికి ఎనలేని కృషి చేసి బాబ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు.
తన హయాంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి.. అనుకున్న ఫలితాలను రాబట్టి బాబ్ చెరగని ముద్ర వేశాడు. ఆయన మార్గనిర్దేశనంలో పురుషుల జట్టు భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. మహిళల టీమ్ అయితే.. తొలిసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ‘రెండు దశాబ్దాలుగా న్యూజిలాండ్ క్రికెట్‌కు సేవలందించడం ద్వారానా కలను సాకారం చేసుకున్నానని అనుకుంటున్నా. పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు కోచింగ్ ఇవ్వడం, ఆటగాళ్లు మెరుగుపడేలా చేయడాన్ని నేను ఎంతో ఆస్వాదించాను.
News | NZC is to farewell its long-serving high-performance coach, Bob Carter.
Carter is poised to depart the NZC’s high-performance centre after 21 years, having been heavily involved in the evolution of both the national men’s and women’s games.https://t.co/hCrKIOtKUe
— WHITE FERNS (@WHITE_FERNS) August 7, 2025
నా మాటలు, నా సూచనలు వాళ్లు విజయవంతం అవ్వడంలో కీలక పాత్ర పోషించాయంటే అదే నాకు నిజంగా గొప్ప సంతృప్తి. అయితే.. న్యూజిలాండ్ క్రికెట్ కృషి కూడా చెప్పుకోదగ్గదే. వాళ్లు ప్రయత్నించిన ఆటగాళ్ల కాంబినేషన్లు, బృందంగా పనిచేయడం, క్రికెటర్లు ఒకరికొకరు సహకరించుకునేలా చూడడం వంటివి న్యూజిలాండ్ క్రికెట్ వికాసానికి తోడ్పడ్డాయి’ అని బాబ్ కార్టర్ వెల్లడించాడు.
కోచ్‌గా విశేషంగా రాణించిన బాబ్ కార్టర్‌కు ఫస్ల్ క్లాస్ క్రికెట్ అనుభవం చాలానే ఉంది. నార్తంప్టన్‌షైర్, కంటెన్బరీ జట్ల తరఫున 60 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 55 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. అనంతరం కోచింగ్ మీద దృష్టి సారించిన బాబ్.. 2004 నుంచి 2009 వరకూ న్యూజిలాండ్ పురుషుల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. తిరిగి 2012లో బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2019లో మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు. ఆ తర్వాత హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గానూ సేవలిందించిన బాబ్ 65 ఏళ్ల వయసులో విశ్రాంతి తీసుకొనేందుకు సిద్ధమయ్యాడు.
Thanks, Bob ❤️
Coach, Bob Carter, confirmed today his contract has finished with the WHITE FERNS and he will return to his role as High Performance Coach with NZC.#CricketNation
📷 ICC/Getty pic.twitter.com/5Ckr3Fyi7u— WHITE FERNS (@WHITE_FERNS) March 26, 2022