Rohit Sharma | ముంబై: టీమ్ఇండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ వీడ్కోలుకు సమయం ఆసన్నమవుతోందా? ఇటీవల కాలంలో వరుస సిరీస్ ఓటములకు తోడు వ్యక్తిగతంగా పేలవ ఫామ్, వయసు, ఇతరత్రా కారణాలతో రోహిత్ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై బీసీసీఐ కూడా రోహిత్‌ను ‘ఫ్యూచర్ ప్లాన్స్’ ఏంటని ఆరా తీసినట్టు బోర్డు వర్గాల సమాచారం.