IRL | కోయంబత్తూర్: ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్)లో నాలుగో రౌండ్లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అఖిల్ అలీభాయ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఫార్ములా-4 ఇండియన్ ఓపెన్ నాలుగో రౌండ్ పోటీల్లో మూడు రేసుల్లో గెలిచి హ్యాటిక్ విజయం సాధించాడు. కొయంబత్తూర్లోని మోటార్స్పీడ్వే ట్రాక్‌లో జరిగిన రేసింగ్‌లో అఖిల్ దుమ్మురేపాడు.