Rahul Dravid : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ముందు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు బిగ్ షాక్. సుదీర్ఘ కాలానికి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అనూహ్యంగా పదవి నుంచి వైదొలిగాడు. స్క్వాడ్‌లో మార్పులపై ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఈ వెటరన్ అకస్మాత్తుగా కోచింగ్ బాధ్యతలకు బైబై చెప్పేశాడు. దాంతో.. మరికొన్నాళ్లు తమ ఫ్రాంచైజీకి కోచ్‌గా ఉంటాడని భావించిన రాజస్థాన్‌కు ఇది ఊహించని షాక్. ఈ దిగ్గజ ప్లేయర్ రాజీనామా చేశాడనే విషయాన్ని రాజస్థాన్ యాజమాన్యం ధ్రువీకరించింది.
‘కొన్నేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ జర్నీలో ద్రవిడ్ ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చాడు. నవతరం క్రికెటర్లపై అతడి నాయకత్వం ఎంతో ప్రభావం చూపించింది. స్క్వాడ్‌లో విలువులు పెంపొందించాడు. ఫ్రాంచైజీలో ఒక మంచి సంస్కృతికి శ్రీకారం చుట్టాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీ నిర్మాణాత్మక కూర్పులో ద్రవిడ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలనుకున్నాం.
🚨 JUST IN: Rahul Dravid has quit as head coach of Rajasthan Royals pic.twitter.com/dlyHRevzZc
— Cricbuzz (@cricbuzz) August 30, 2025
కానీ, అతడు మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. రాజస్థాన్ ఆటగాళ్లు, లక్షలాది మంది అభిమానులు కోచ్‌గా ద్రవిడ్ విశేషమైన సేవలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ‘అని ఫ్రాంచైజీ ప్రకటనలో వెల్లడించింది. ద్రవిడ్ వైదొలగడంతో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న కుమార సంగక్కర(Kumar Sangakkara)కు మళ్లీ కోచ్ పగ్గాలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Official Statement pic.twitter.com/qyHYVLVewz
— Rajasthan Royals (@rajasthanroyals) August 30, 2025
నిరుడు భారత జట్టుకు టీ20 వరల్డ్ కప్ అందించిన రాహుల్ ద్రవిడ్ 18వ సీజన్లో రాజస్థాన్ హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు. సీజన్ ప్రారంభానికి ముందే ఎడమ పాదానికి గాయం కావడంతో చక్రాల కుర్చీలోంచే జట్టుకు సూచనలు, సలహాలు ఇచ్చాడు ద్రవిడ్. కానీ, అతడి మార్గనిర్దేశనంలో రాజస్థాన్ దారుణంగా విఫలైమంది. కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వడం.. బౌలింగ్ యూనిట్ రాణించకపోవడంతో కేవలం నాలుగు విజయాలకే పరిమితమైంది.
దాంతో.. తొమ్మిదో స్థానంతో నిరాశపరిచింది. పైగా సంజూ శాంసన్ జట్టును వీడేందుకు సిద్ధమైన నేపథ్యలో ద్రవిడ్ రాజీనామా పలు సందేహాలుకు తావిస్తోంది. అయితే.. నిజమైన కారణం ఏంటనేది త్వరలోనే తెలియనుంది. ఐపీఎల్లో ద్రవిడ్ 2011 నుంచి 2015 మధ్య కాలంలో రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
Your presence in Pink inspired both the young and the seasoned. 💗
Forever a Royal. Forever grateful. 🤝 pic.twitter.com/XT4kUkcqMa
— Rajasthan Royals (@rajasthanroyals) August 30, 2025