క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ క్షమాపణలు చెప్పారు. అదేంటి? ఇద్దరు లెజెండరీ వ్యక్తుల మధ్య ఇలా సారీలు చెప్పుకునే అవసరం ఏమొచ్చింది? అనే అనుమానం రావడం సహజం. దీనికి కారణం మరికొన్నిరోజుల్లో జరగబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ).
ఈ లీగ్ ప్రమోషన్లో భాగంగా అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఈ వీడియోలో అమితాబ్.. చాలా మంది క్రికెట్ లెజెండ్స్లా ప్రవర్తిస్తూ ఆకట్టుకున్నారు. సెహ్వాగ్, గేల్, యువరాజ్, భజ్జీ (హర్భజన్ సింగ్) వంటి దిగ్గజాలు ఈ టోర్నీలో ఆడుతున్నారని చెప్పారు.
ఈ క్రమంలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ లీగ్ ఆడుతున్నట్లు చూపించారు. అయితే నిజానికి సచిన్ ఈ లీగ్‌లో ఈసారి ఆడటం లేదు. ఇదే విషయాన్ని సచిన్ సోషల్ మీడియా టీం చెప్పింది. సచిన్ టీం ఈ విషయాన్ని బిగ్‌బీ బృందానికి చెప్పడంతో జరిగిన పొరపాటును అమితాబ్ గుర్తించారు.
వెంటనే ఆ ట్వీట్‌ను మారుస్తూ క్షమాపణలు చెప్పారు. ‘‘ఈ పొరపాటు వల్ల కలిగిన ఇబ్బందికి బాధపడుతున్నాను. ఇది కావాలని చేసింది కాదు’’ అంటూ బిగ్‌బీ మరో వీడియో షేర్ చేశారు.
T 4152 – CORRECTION : Legends League Cricket T20 , FINAL promo .. apologies .. and regrets for any inconvenience caused .. the error was inadvertent .. 🙏🙏🙏#legendsleaguecricket #bosslogonkagame pic.twitter.com/Zo33KqZxKU
— Amitabh Bachchan (@SrBachchan) January 8, 2022