హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13 : ఫిలిప్పిన్స్ వేదికగా ఈ నెల 20 నుంచి జరిగే జూనియర్ ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో వరంగల్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కోశాధికారి కోమటి భరద్వాజ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. జేఎన్ఎస్లోని జిమ్నాస్టిక్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన భరద్వాజ్ పలు జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించి ఎన్నో పతకాలు సాధించారు.
ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ జాతీయస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో న్యాయనిర్ణేతగగా వ్యవహరించి అంతర్జాతీయ న్యాయనిపుణుల ప్రవేశ పరీక్షకు అర్హత సాధించాడు. ఈ ఏడాది జపాన్లో ఇంటర్నేషనల్ జడ్జీల కోర్సులో పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే 94.7 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. భరద్వాజ్ పనితీరును పరిశీలిస్తూ ఫిలిప్పిన్స్లో జరిగే ప్రపంచకప్ పోటీల్లో న్యాయనిర్ణేతగా వ్యవహరించే అవకాశం కల్పించారు.