షిమ్కెంట్(కజకిస్థాన్) : ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ బోణీ కొట్టింది. పోటీలకు తొలి రోజైన సోమవారం జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ రజత పతకంతో మెరిసింది. అన్మోల్ జైన్ (580), ఆదిత్యా మల్రా (579), సౌరభ్ చౌదరీ (576)తో కూడిన భారత త్రయం 1,735 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
చైనా (1744), ఇరాన్ (1733) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి. మరోవైపు పురుషుల వ్యక్తిగత 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అన్మోల్ 155.1 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. పురుషుల జూనియర్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో యువ షూటర్ కపిల్ (243.0) స్వర్ణం కైవసం చేసుకోగా, గవిన్ ఆంథోనీ (220.7) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.