న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ)లో అలజడి! అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రధాన కార్యదర్శి హేమంత కలిత, కోశాధికారి దిగ్విజయ్సింగ్పై సస్పెన్షన్ వేటు పడింది.
ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో ఈ ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు బీఎఫ్ఐ మంగళవారం పేర్కొంది. దీంతో త్వరలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడేందుకు సిద్ధమైన హేమంత నామినేషన్ను కూడా తిరస్కరణకు గురైంది.