గోపాల్పేట, ఫిబ్రవరి 5 : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమనే మాటను నిజం చేస్తూ దివ్యాంగుల క్రికెట్లో రాణిస్తున్నాడో యువకుడు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు బెంజిమెన్ ప్రభాకర్ జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 14 నుంచి 19వ తేదీ వరకు ఖాట్మాండ్(నేపాల్)లో జరుగనున్న అంతర్జాతీయ దివ్యాంగుల క్రికెట్ టోర్నీలో భారత్ తరపున ఆడనున్నాడు. మరోవైపు గతేడాది హైదరాబాద్లో జరిగిన పారా అథ్లెటిక్స్ షాట్పుట్లోకాంస్య పతకం దక్కించుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే చిరకాల కోరిక నెరవేరిందనిప్రభాకర్ పేర్కొన్నాడు.