మాంచెస్టర్: ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన నాలుగువ టెస్టులో హై డ్రామా చోటుచేసుకున్నది. ఆ మ్యాచ్ డ్రా అయినా.. ఆఖరి రోజు మరో గంటలో మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) ఇచ్చిన ఆఫర్‌ను మన క్రికెటర్లు తిరస్కరించారు. ఇక డ్రా అనివార్యం అని తెలిసిన సయమంలో.. బెన్ స్టోక్స్ హ్యాండ్‌షేక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమయంలో జడేజా 89, సుందర్ 80 రన్స్ వద్ద బ్యాటింగ్ చేస్తున్నారు.
స్టోక్స్ చేసిన ఆఫర్‌ను జడేజా స్వీకరించలేదు. సెంచరీకి చేరువలో ఉన్న భారత క్రికెటర్లు.. ముందుగానే డ్రాను అంగీకరించేందుకు ఇష్టపడలేదు. డ్రా కోసం హ్యాండ్‌షేక్ ఇచ్చేందుకు భారత క్రికెటర్లు ఎందుకు నిరాకరించారో స్టోక్స్‌కు అర్థం కాలేదు. దాంతో అతను భారత క్రికెటర్లను వేధించే ప్రయత్నం చేశాడు. రిజల్ట్ రాదు అని తెలిసి కూడా ఎందుకు ఇండియా బ్యాటింగ్ చేయాలనుకుంటుందో జాక్ క్రాలే, బెన్ డకెట్‌కు కూడా అర్థం కాలేదు.
ఆ సమయంలో జడేజాపై స్టోక్స్ కామెంట్ చేశాడు. హ్యారీ బ్రూక్ బౌలింగ్‌లో సెంచరీ కొట్టానలుకుంటున్నావా అని జడేజాపై వ్యంగ్యంగా కామెంట్ చేశాడు స్టోక్స్. దానికి జడేజా బదులిస్తూ తానేమీ చేయలేనన్నాడు. రూల్స్ ప్రకారం భారత బ్యాటర్లు ఇంకా గంట సేపు బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉన్నది. ఆ దశలో భారత బ్యాటర్ల వైఖరిని నిరసిస్తూ హ్యారీ బ్రూక్‌తో బౌలింగ్ చేయించాడు స్టోక్స్. బ్రూక్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన జడేజా టెస్టుల్లో మూడవ సెంచరీ పూర్తి చేశాడు. జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు పూర్తి కాగానే, ఆ ఇద్దరు ప్లేయర్లు ఇంగ్లండ్ క్రికెటర్లకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. దీంతో మ్యాచ్ డ్రా అయ్యింది.
Scored a hundred, saved the Test, farmed ♾ aura! 💁♂#RavindraJadeja didn’t hesitate, till the end 👀#ENGvIND 👉 5th TEST | Starts THU, 31st July, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/cc3INlS07P
— Star Sports (@StarSportsIndia) July 27, 2025