Ben Stokes : సుదీర్ఘ ఫార్మాట్‌ను ప్రాణంగా ప్రేమించే బెన్ స్టోక్స్ (Ben Stokes) అరుదైన క్లబ్లో చేరాడు. మాంచెస్టర్ రెడ్ బాల్‌తో రెచ్చిపోయిన ఇంగ్లండ్ సారథి ‘గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్ల’ సరసన చోటు సంపాదించాడు. మాంచెస్టర్ టెస్టు (Manchester Test) రెండోరోజు భారత్‌పై ఐదు వికెట్లు తీయడం ద్వారా.. టెస్టుల్లో పదికి పైగా శతకాలు, ఐదు పర్యాయాలు ఐదేసి వికెట్లు తీసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా చరిత్ర సృష్టించాడు. స్టోక్స్ కంటే ముందు గ్యారీఫీల్డ్ (Garfield Sobers), ఇయాన్ బోథమ్ (Ian Botham), జాక్వెస్ కలిస్ (Jacques Kallis) వంటి దిగ్గజాలు ఈ ఘనత సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం స్టోక్స్ ఖాతాలో పది టెస్టు సెంచరీలు ఉన్నాయి. కరీబియన్ లెజెండ్ సోబర్స్ 26 శతకాలు బాదడంతో పాటు 6 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్ వెటరన్ బొథమ్ టెస్టుల్లో 14 సెంచరీలే కొట్టినా.. ఏకంగా 27 సార్లే ఐదేసి వికెట్లతో అదరహో అనిపించాడు. సఫారీ క్రికెట్ యోధుడు కలిస్ 45 సెంచరీలు కొట్టడమే కాకుండా ఐదు పర్యాయలు 5 వికెట్లతో చెలరేగాడు. తాజాగా స్టోక్స్ రాకతో అరుదైన ఈ మైలురాయికి చేరువైన ఆల్‌రౌండర్ల సంఖ్య నాలుగుకు చేరింది.
Stokes joins Sobers, Botham and Kallis 🤩 pic.twitter.com/8mKsf4ssfF
— ESPNcricinfo (@ESPNcricinfo) July 24, 2025
రెండేళ్ల క్రితం భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్‌తో 50 ఓవర్ల ఫార్మాట్‌ను వదిలేసి టెస్టులనే నమ్ముకున్న స్టోక్స్ సారథిగా మెప్పిస్తున్నా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా విఫలమయ్యేవాడు. ఈ ఏడాది భారత పర్యటనలో నిరాశపరిచిన స్టోక్స్ మళ్లీ గాడిలో పడ్డాడు. తాను మునపటిలా ఆల్‌రౌండర్‌గా జట్టుకు పనికొస్తానని చాటుతూ సొంతగడ్డపై టీమిండియాతో జరుగుతున్న సిరీస్‌లో వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు.
సిరీస్‌లో కీలకమైన మాంచెస్టర్‌లో పేసర్లను కాదని ఆతిథ్య జట్టు కెప్టెన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. భారత మిడిలార్డర్‌ను కకావికలం చేస్తూ ఇంగ్లండ్ పాలిట హీరోగా మారాడు. టాపార్డర్‌లో సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, శార్ధూల్ ఠాకూర్లను వెనక్కి పంపిన స్టోక్స్.. లంచ్ తర్వాత ఒకే ఓవర్లో వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంభోజ్లను ఔట్ చేసి ఐదు వికెట్లు సాధించాడు.
Ben Stokes. Five wickets. World class.
🤝 @IGcom pic.twitter.com/ZXDz6Fshkv
— England Cricket (@englandcricket) July 24, 2025