ముల్తాన్: పాకిస్థాన్ పర్యటనలో ఇంగ్లండ్ జోరు కొనసాగుతోంది. ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ను 366 పరుగులకే కట్టడి చేసిన బెన్ స్టోక్స్ సేన.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 53 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (114) శతకంతో చెలరేగగా జో రూట్ (34) రాణించాడు. అయితే రెండో రోజు చివరి సెషన్లో మరో 10 ఓవర్లు అయితే ఆట ముగుస్తుందనగా ఇంగ్లీష్ జట్టు వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్పిన్నర్ సాజిద్ ఖాన్.. రూట్, బ్రూక్ (9), బెన్ స్టోక్స్ (1), డకెట్‌ను ఔట్ చేసి పర్యాటక జట్టును కష్టాల్లోకి నెట్టాడు.