Wimbledon : గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో ఛాంపియన్‌గా నిలవాలన్నది ఆమె కల. కానీ, ప్రతిసారి క్వార్టర్ ఫైనల్ ముందే వెనుదిరిగేది. కానీ, పట్టువదలకుండా ప్రయత్నించేది. చివరకు తొమ్మిదోసారి ఆమె క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తనే స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ బెలిండా బెన్సిక్ (Belinda Bencic). సోమవారం ఉత్కంఠగా సాగిన నాలుగో రౌండ్లో బెలిండా 18వ సీడ్‌కు చెక్ పెట్టింది. కోర్ట్ నంబర్ 1లో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఎకటేరినా అలెగ్జాండ్రోవాపై 7-6 (4), 6-4తో గెలుపొందింది.
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బెలిండా అత్యుత్తమ ప్రదర్శన 2019లో యూఎస్ ఓపెన్ సెమీస్ ఆడడం. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా ముందంజ వేయలేకపోయింది. తాజాగా తొమ్మిదేళ్ల తర్వాత వింబుల్డన్ క్వార్టర్స్ చేరడంతో బెలిండా గాల్లో తేలిపోతోంది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. మీ అందరికీ ఎంటర్టైన్మెంట్. కానీ, నేను మాత్రం చాలా ఒత్తిడికి లోనయ్యాను. ఇక్కడ నేను ప్రతిసారి నాలుగో రౌండ్లోనే ఇంటిదారి పట్టేదాన్ని. గత ఎనిమిదిసార్లు అదే జరిగింది. కానీ, ఈసారి నేను క్వార్టర్స్ చేరాను. చాలా సంతోషంగా ఉంది అని బెలిడా తెలిపింది.